ప్రభు యేసు నా రక్షకా | Prabhu Yesu Naa Rakshakaa | JC Worship Studio

JC Worship Studio
0
ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. కాబట్టి దేవుని నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్ధించాలని కీర్తనలు గ్రంథమందు దావీదు భక్తుడు తెలియచేయుచున్నాడు  . 

పాట వ్రాసినవారు : సీయోను గీతాలు
Lyricist : Songs Of Zion

ప్రభు యేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)    ||ప్రభు యేసు||

ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె - ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

లెక్కలేని మార్లు పడిపోతిని - దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి - గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

ఎరిగి యెరిగి నే చెడిపోతిని - యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి - దాసుడ నన్ను జూడనిమ్ము (2)   ||ప్రభు యేసు||

ఎందరేసుని వైపు చూచెదరో - పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు - ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||

విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ - కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు - విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||

కంటికి కనబడని వెన్నియో - చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో - సిద్ధపరచితివ నాకై (2)  ||ప్రభు యేసు||

లోక భోగాలపై నా నేత్రాలు  - సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును - నిండార నను జూడనిమ్ము (2)  ||ప్రభు యేసు||

Prabhu Yesu Naa Rakshakaa - Nosagu Kannulu Naaku
Nirathamu Ne Ninnu Jooda (2)
Alphayu Neeve Omegayu Neeve (2)           ||Prabhu Yesu||

Priyudaina Yohaanu Pathmaasulo - Priyamaina Yesu Nee Swaroopamu (2)
Priyamaara Joochi Bahu Dhanyudayye - Priya Prabhu Ninnu Joodanimmu (2)   ||Prabhu Yesu||

Lekkaleni Maarlu Padipothini - Dikkulenivaada Nenaithini (2)
Chakkajesi Naa Nethraalu Derachi - Grakkuna Ninnu Joodanimmu (2)     ||Prabhu Yesu||

Erigi Yerigi Ne Chedipothini - Yesu Nee Gaayamu Repithini (2)
Mosapothi Nenu Drushti Dolagithi - Daasuda Nannu Joodanimmu (2)          ||Prabhu Yesu||

Endaresuni Vaipu Choochedaro - Pondedaru Velgu Mukhamuna (2)
Sandiyambu Leka Santhoshinchuchu - Munduku Parugeththedaru (2)          ||Prabhu Yesu||

Vishwaasakarthaa O Yesu Prabhuu - Konasaaginchuvaadaa Yesu Prabhuu (2)
Vinayamutho Nenu Nee Vaipu Joochuchu - Visugaka Parugeththa Nerpu (2)          ||Prabhu Yesu||

Kantiki Kanabadani Venniyo - Cheviki Vinabadani Venniyo (2)
Hrudaya Gocharamu Kaani Venniyo - Sidhdhaparachithiva Naakai (2)           ||Prabhu Yesu||

Loka Bhogaalapai Naa Nethraalu - Sokakundunatlu Krupa Joopumu (2)
Nee Mahima Divya Swaroopamunu - Nindaara Nanu Joodanimmu (2)          ||Prabhu Yesu||

Post a Comment

0Comments

Post a Comment (0)