వర్ణింపలేను వివరింపలేను --Varnimpalenu Vivarimpalenu

JC Worship Studio
0

వర్ణింపలేను వివరింపలేను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)

పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ||యేసయ్యా||

అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ||యేసయ్యా||

తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను         ||యేసయ్యా||

Post a Comment

0Comments

Post a Comment (0)