పాట రచయిత: అల్లారి పెద్ద వీరాస్వామి
Lyricist: Allaari Pedda Veeraaswaami
దేవర
నీ దీవెనలు - ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను (2)
దంపతులు
దండిగ నీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ||
ఈ కవను నీ కరుణన్ - ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా - బ్రాకటముగను జేకొనుము
||దేవర
నీ||
ఇప్పగిది
నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ||
తాపములు
పాపములు - మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి - యాపదలన్నియు బాపుచును
||దేవర
నీ||
సాధులుగన్
జేయుటకై - శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్
||దేవర
నీ||
మెండుగ
భూమండలపు - గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండించావే
||దేవర
నీ||
యిద్దరు
వీరిద్దరును - శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్
||దేవర
నీ||
వాసిగ
నీ దాసులము - చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ - యేసుని పేరిట బ్రోవుమామేన్
||దేవర
నీ||
Devara Nee Deevenalu - Dhaaraalamuganu Veeralapai
Baaguga Vegame Diganimmu - Paavana Yesuni Dvaaraganu (2)
Dampathulu Dandiga Nee - Dhaathrilo Velayuchu Sampadalan
Sompuga Nimpuga Pempaguchu - Sahimpuna Veeru Sukhinchutakai ||Devara Nee||
Ee Kavanu Nee Karunan - Aakaru Varakunu Lokamulo
Shokamu Lekaye Ekamugaa - Braakatamuganu Jekonumu ||Devara Nee||
Ippagidi Neppudunu - Goppagu Prematho Noppuchu Daa
Moppina Choppuna Dappakanu - Meppuga Brathukaga Bampu Krupan ||Devara Nee||
Thaapamulu Paapamulu - Mopuga Veeripai Raakundagaa
Gaapuga Braapuga Daapunundi - Yaapadalanniyu Baapuchunu ||Devara Nee||
Saadhulugan Jeyutakai - Shodhanalache Neevu Shodhinpagaa
Kadalaka Vadalaka Mudamuna Nee - Paadamu Daapuna Baadukonan ||Devara Nee||
Menduga Bhoomandalapu - Gandamulalo Veerundaganu
Thandriga Dandiga Nandanundi - Vendiyu Vaanini Khandinchave ||Devara Nee||
Iddara Veeriddarunu - Shudhdhulai Ninnu Sevinchutakai
Shradhdhatho Budhdhiga Sidhdhapadan-Didhdhumu Nee Priya Biddalugan||Devara Nee||
Vaasiga Nee Daasulamu - Chesina Ee Moral Deesikoni
Maa Sakaleshwara Nee Suthuda - Yesuni Perita Brovumaamen ||Devara Nee||
.png)