ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి | Priyuda Ni Prema Padamul | JC Worship Studio

JC Worship Studio
0

మనము ప్రతీ విషయములో దేవుని పాదముల చెంత చేరినపుడు ఆయన చేసే కార్యములు అద్భుతము ,ఆశ్చర్యము . ఎందుకంటే ఆయన తన విలువైన రక్తమునిచ్చి మనలను కాచి కాపాడుచున్న దేవుడు. 

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి - నెమ్మది నెమ్మదియే  (2)
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే  (2)
అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2)

 నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా  (2)
మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా  (2)
మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా  (2)

 బలియైన గొఱ్ఱెగా - పాపములన్నిటిని మోసి తీర్చితివే  (2)
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా  (2)
పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా  (2)

ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా (2)
రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం నిశ్చయమే (2)
రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా (2)

Post a Comment

0Comments

Post a Comment (0)