దేశమా దేశమా సిగ్గుపడు -Desamaa Desamaa Siggupadu

JC Worship Studio
0
Lyricist: Vijay Prasad Reddy
రచయత : విజయ్ ప్రసాద్ రెడ్డి 



దేశమా దేశమా సిగ్గుపడు దేశమా
దేశమా దేశమా జాలిపడు దేశమా
ఆడబిడ్డ నడివీధిన ఊరేగుతుంది
చచ్చిపడి కామాంధుల కోరికలకు బలవుతుంది
నీటిబుగ్గ పగిలినట్టు గర్భసంచి పగులుతోంది
మత ఉన్మాద కోర కొరికి కొరికి చంపేస్తుంది
నెత్తురోడుతుంది దేశం నెత్తురోడుతుంది
రక్తమోడి రక్తమోడి అడుగు తడబడింది
స్వార్ధమను సుత్తెలు మోది దేశం తలపగిలింది
మారణహొమాలతో చిద్రం చేసేస్తోంది (దేశమా)

తెల్లొడి బానిసగా బ్రతికిన కధ ముగిసింది
నల్లోడి పాలనలో మళ్లీ వురి బిగిసింది
స్వతంత్ర దినోత్సవం పండగలా మారింది
కాలే కడుపులకు స్వేచ్చ అనేది ఎక్కడుంది?
దేశమంటె మట్టికాదు మనుషులంటు నేర్పారు
మట్టికె ఆశపడి మనుషుల్ని చంపుతున్నారు
భారతీయులందరమూ అన్నదమ్ములన్నారు
కుల మత వివక్షలతో మళ్లీ చిచ్చురేపారు
పశువుకున్న విలువైనా పడుచులకు లేదాయే
చావు మేళాలతోనే కొత్తరోజు మొదలాయే
మూత్రాభిషేకాలతో మన గుండెలు తడిశాయే
పేదల శవ యాత్రలో అభివృద్దిని వెదికాయే

దేశమా దేశమా దుఖ్ఖపడు దేశమా
దేశమా దేశమా బాగుపడు దేశమా
దైవమా దైవమా మమ్ము కాపాడుమా
దైవమా దైవమా దేశాన్ని కాయుమా

Post a Comment

0Comments

Post a Comment (0)