దీవించావే సమృద్ధిగా - Deevinchaave Samruddhigaa

JC Worship Studio
0
రచయత:
Lyricist:


దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా    (దీవించావే )

నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే  (2)
ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని     (దీవించావే )

కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే      (దీవించావే )

Post a Comment

0Comments

Post a Comment (0)