పాట రచయిత: కే రాజబాబు
Lyricist: K Rajababu
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా - నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…
కొండలలో లోయలలో - అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
ఆత్మీయులే నన్ను అవమానించగా - అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
వంచెన వంతెన ఒదిగిన భారాన - ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa..
Ninne Ninne Ne Koluthunayyaa - Neeve Neeve Naa Raajuvayyaa (2)
Yesayya Yesayya Yesayyaa…
Kondalalo Loyalalo Adavulalo Edaarulalo (2)
Nannu Gamaninchinaavaa - Nannu Nadipinchinaavaa (2) ||Yesayyaa||
Aathmeeyule Nannu Avamaaninchagaa - Anyule Nannu Apahasinchagaa (2)
Anda Neevaithivayyaa - Naa Konda Neeve Yesayyaa (2) ||Yesayyaa||
Marana Chaayalalo Merisina Nee Prema - Naligina Brathukuna Kurisina Nee Krupa (2)
Nannu Balaparachenayyaa - Ninne Ghanaparathunayyaa (2) ||Yesayyaa||
Vanchena Vanthena Odigina Bhaaraana - Osagaka Visigina Visire Kerataana (2)
Kalalaa Kadatherchinaavaa - Nee Valalo Nanu Mosinaavaa (2) ||Yesayyaa||
.png)