Lyricist: Daniel W Whittle
ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము
ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా
ఓ దేవా పంపింపవయ్యా - నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి ||
మా మీద కురియించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద - క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి ||
ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||
.png)