ఆశ్చర్యమైన ప్రేమ

JC Worship Studio
0
పాట రచయిత: డి జోసెఫ్
Lyricist: D Joseph

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది

నన్ను జయించె నీ ప్రేమ (2)                                                           ||ఆశ్చర్యమైన||

పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే          ||ఆశ్చర్యమైన||

పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే   ||ఆశ్చర్యమైన||

శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు                             ||ఆశ్చర్యమైన||

నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే                 ||ఆశ్చర్యమైన||

Post a Comment

0Comments

Post a Comment (0)