మేలు చేయక నీవు ఉండలేవయ్య | Melu Cheyaka Neevu Vunndalevayya | JC Worship Studio

JC Worship Studio
0
పాట వ్రాసినవారు: టి జాబ్ దాస్
Lyricist: T Job Das


మేలు చేయక నీవు ఉండలేవయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య ( 2 )
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా   ( 2 )

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే  ( 2 )
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా  ( 2 )
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది   ((యేసయ్యా ))

ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే  ( 2 )
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్  ( 2 )
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి    ((యేసయ్యా ))

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో  ( 2 )
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని  ( 2 )
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు    ((యేసయ్యా ))

Post a Comment

0Comments

Post a Comment (0)