యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా - YESAYYA NAKANTU EVARU LERAYA

JC Worship Studio
0
పాట రచయిత :



యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా (2)
నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2)     ((యేసయ్యా))

కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయటచెప్పుకోలేక మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2)    ((యేసయ్యా))

లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు ననువీడగ భారమాయెను (2)
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు!
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2)     ((యేసయ్యా))

Post a Comment

0Comments

Post a Comment (0)