దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని {{ దేవునికి }}
గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని {{ దేవునికి }}
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని {{ దేవునికి }}
ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని {{ దేవునికి }}
దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి {{ దేవునికి }}
ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని {{ దేవునికి }}
పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును {{ దేవునికి }}
గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని {{ దేవునికి }}
యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని {{ దేవునికి }}
పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును {{ దేవునికి }}
భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును {{ దేవునికి }}
వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని {{ దేవునికి }}
Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi
Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi
Yerushalemu Yehovaye Kattuchunnavaadani
Ishrayeleeyulanu Pogucheyuvaadani {{ Devuniki }}
Gunde Chedarina Vaarini Baagucheyuvaadani
Vaari Gaayamulanniyu Kattuchunnavaadani {{ Devuniki }}
Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu
Vaatikanniyu Perulu Pettuchunnavaadani {{ Devuniki }}
Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu
Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani {{ Devuniki }}
Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu
Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi {{ Devuniki }}
Aayana Aakaashamun Meghamulatho Kappunu
Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani {{ Devuniki }}
Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu
Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu {{ Devuniki }}
Gurramula Narulandali Balamu Naanandinchadu
Krupa Vedu Vaarilo Santhasinchuvaadani {{ Devuniki }}
Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni
Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani {{ Devuniki }}
Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul
Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu {{ Devuniki }}
Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane
Vegamugamu Devuni Vaakyamu Parugeththunu {{ Devuniki }}
Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani
Ae Janamukeelaaguna Chesiyundaledani {{ Devuniki }}
.png)