పాట రచయిత: డి జే ఆగస్టీన్
Lyricist: D J Augustine
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము (2)
ఈ శాప లోకాన నీ సాక్షులుగా నిలువ
నీ ఆత్మతో నింపుమా (2) ||దేవా||
కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్యా
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము ||దేవా||
సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము
నెమ్మది గల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్యా
ఇమ్ముగ దయచేయుము గిన్నె నిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా మమ్ములను బలపరచుము ||దేవా||
ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను
లోక దురు వ్యసనంలా తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో
ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి
ఫల సంపదలతోను కలకాలము జీవించ కురుపించుము నీ దీవెనలన్ ||దేవా||
పెంపారు జేయుము మాలో సొంపుగ నీ ఘన ప్రేమన్
నింపుమా హృదయములు శాంతి భాగ్యంబులతో సంతసంబుగ సాగెదము
వింతైన నీ ప్రేమను అంతట ప్రకటింతుము
కొంత కాలమే మేము ఉందుము లోకాన చెంత చేరగ కోరెదము
నీ చెంత చేరగ కోరెదము ||దేవా||
Devaa Maa Kutumbamu – Nee Sevake Ankithamu (2)
Ee Shaapa Lokaana – Nee Saakshulugaa Niluva
Nee Aathmatho Nimpumaa (2) ||Devaa||
Kaapari Maa Yesu Prabhuve – Koduvemi Ledu Maaku
Maakemi Bhayamu – Maakemi Digulu
Neeke Vandanamulayyaa
Lobadi Jeevinthumu – Lopambulu Savarinchumu
Lokaashalu Veedi – Lokambulona
Nee Mandagaa Undumu ||Devaa||
Samruddhi Jeevambunu – Samruddhigaa Maakimmu
Nemmadi Gala Illu – Nimmalamagu Manassu
Immahilo Maakimmayyaa
Immuga Dayachesyumu – Ginne Nindina Anubhavamu
Enno Kutumbaala Dhanyulugaa Jeyangaa
Mammulanu Balaparachumu ||Devaa||
Ae Keedu Raakundagaa – Kaapaadumu Maa Pillalanu
Loka Duru Vyasanamula – Thaakudu Lekunda
Daachumu Nee Chethulalo
Oleeva Mokkala Valenu Draakshaa Theegelanu Poli
Phala Sampadalathonu – Kalakaalamu Jeevincha
Kurupinchumu Nee Deevenalan ||Devaa||
Pempaara Jeyumu Maalo – Sompuga Nee Ghana Preman
Nimpumaa Hrudayamula – Shaanthi Bhaagyambulatho
Santhasambuga Saagedamu
Vinthaina Nee Premanu – Anthata Prakatinthumu
Kontha Kaalame Memu – Undumu Lokaana
Chentha Cheraga Koredamu
Nee Chentha Cheraga Koredamu ||Devaa||
.png)