Chintha Ledika - చింత లేదిక

JC Worship Studio
0

పాట రచయిత: ఎన్ డి ఏబెల్
Lyricist: N D Abel


చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా - సంతసమొందుమా (2)

దూత తెల్పెను గొల్లలకు - శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి - స్తుతులొనరించిరి           ||చింత లేదిక||

చుక్క గనుగొని జ్ఞానులేంతో - మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి - కానుకలిచ్చిరి          ||చింత లేదిక||

కన్య గర్భమునందు పుట్టెను - కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై - సర్వ మాన్యులై          ||చింత లేదిక||

పాపమెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము - మోక్ష భాగ్యము       ||చింత లేదిక||

Chintha Ledika Yesu Puttenu - Vinthaganu Bethlehamanduna
Chentha Jeranu Randi Sarva Janaangamaa - Santhasamondumaa (2)

Dootha Thelpenu Gollalaku - Shubhavaartha Naa Divasambu Vinthagaa
Khyaathi Meeraga Vaaru Yesunu Gaanchiri - Sthuthulonarinchiri          ||Chintha Ledika||

Chukka Ganugoni Gnaanulentho - Makkuvatho Naa Prabhuni Kanugona
Chakkagaa Bethlehe Puramuna Jochchiri - Kaanukalichchiri            ||Chintha Ledika||

Kanya Garbhamunandu Puttenu - Karunagala Rakshakudu Kreesthudu
Dhanyulagutaku Randi Vegame Deenulai - Sarva Maanyulai             ||Chintha Ledika||

Paapamellanu Pariharimpanu - Parama Rakshakudavatharinchenu
Daapu Jerina Vaarikidu Gudu Bhaagyamu - Moksha Bhaagyamu           ||Chintha Ledika||

Post a Comment

0Comments

Post a Comment (0)