ఇది శుభోదయం || Idi Subhodayam

JC Worship Studio
0



ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం-మేరి పుణ్యదినం  (2)

రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||

Post a Comment

0Comments

Post a Comment (0)