ఇదిగో దేవా నా జీవితం|| Idigo Deva Na Jeeevitham

JC Worship Studio
0

 


  • ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
    శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)


    1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
    అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
    అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం    (ఇదిగో దేవా)


    2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
    ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
    ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము   (ఇదిగో దేవా)


    3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
    కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
    క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
    నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా   (ఇదిగో దేవా)

Post a Comment

0Comments

Post a Comment (0)