పాట రచయిత: అంశుమతి మేరీ
Lyricist: Amshumathi Mary
Lyricist: Amshumathi Mary
హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2)
ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు (2)
శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)
ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం
అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు (2)
నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు
నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)
ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్
పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)
అడోనై అడోనై అడోనై అడోనై
ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)
యావే యావే యావే యావే
యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి (2)
పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు
ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)
.png)