అసాధ్యమైనది లేనే లేదు

JC Worship Studio
0



అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
నా దేవుడు నన్ను నడిపించును (2)
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా (2)

శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును (2)  ||సాధ్యమే||

సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును (2)    ||సాధ్యమే||






Post a Comment

0Comments

Post a Comment (0)