Lyricist: William Cowper
పాట రచయిత: విలియం కౌపర్ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము - పాపంబు పోవును
యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు - స్రవించు నాకుగా
ఆ యూట మున్గి దొంగయు - హా! శుద్ధుడాయెను
నేనట్టి పాపి నిప్పుడు - నేనందు మున్గుదు ||యేసుండు||
నీ యొక్క పాప మట్టిదే - నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ - రక్తంబే చాలును ||యేసుండు||
నా నాదు రక్తమందున - నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ - నే నిందు జూచెదన్ ||యేసుండు||
నా ఆయుష్కాల మంతటా - నా సంతసంబదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్ - నా గాన మిద్దియే ||యేసుండు||
.png)