1 ➤ రెండవ సమూయేలు గ్రంధము మొత్తము
ఎవరి గురించి కలదు?
A. సమూయేలు
B. సౌలు
C. అబ్షాలోము
D. దావీదు
Answer: D .దావీదు.
2 ➤ దావీదు ఎవరిని హతముచేసి సిక్లగు తిరిగి వచ్చెను?
A. అమాలేకీయులు
B. అమ్మోనీయులు
C. మోయాబీయులు
D. ఫిలిష్తీయులు
Answer: A .అమాలేకీయులు.
3 ➤ సౌలును ఏ పర్వతము పై మరణమయ్యెను?
A. కర్మెలు పర్వతము
B. హెర్మోను పర్వతము
C. గిల్బోవ పర్వతము
D. సూపు
Answer: C .గిల్బోవ పర్వతము.
4 ➤ 'నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది' అని ఎవరు అమాలేకీయునితో చెప్పారు?
A. దావీదు
B. యోవాబు
C. అబీషై
D. బెనాయా
Answer: A .దావీదు.
5 ➤ పక్షిరాజులకంటె వడిగలవారు,సింహములకంటె బలముగలవారు ఎవరు?
A. యోవాబు , అబీషై
B. అమ్నోను, అబ్యాతారు
C. సౌలు,యోనాతాను
D. యోనాతాను,అబీనాదాబు
Answer: C .సౌలు,యోనాతాను.
6 ➤ తమ మరణంలో ఒకరినొకరు ఎడబాయని తండ్రి, కుమారుడు ఎవరు?
A. ఏలి, ఫీనెహాసు
B. దావీదు అమ్నోను
C. సమూయేలు, యోవేలు
D. సౌలు,యోనాతాను
Answer: D .సౌలు,యోనాతాను.
7 ➤ సౌలు, యోనాతానుల మరణాన్ని గురించి ఎక్కడ ప్రకటించవద్దని దావీదు చెప్పాడు?
A. మిస్పాలో
B. యెరూషలేములో
C. షిలోహులో
D. గాతులో
Answer: D .గాతులో.
8 ➤ యూదావారిమీద దావీదు ఎక్కడ రాజుగా అభిషేకించబడ్డాడు?
A. హెబ్రోనులో
B.యెరూషలేములో
C. రామాలో
D. సిక్లగులో
Answer: A .హెబ్రోనులో.
9 ➤ సౌలును పాతిపెట్టినవారు ఎవరు?
A. గిలాదువారు
B.యాబేష్గిలాదువారు
C. యూదావారు
D. ఇశ్రాయేలువారు
Answer: B .యాబేష్గిలాదువారు.
10 ➤ అడవి లేడియంత తేలికగా పరుగెత్తగలవాడు ఎవరు?
A. ఇష్బోషెతు
B. అబ్నేరు
C. అశాహేలు
D. అబీషై
Answer: C .అశాహేలు.
11 ➤ దావీదు జ్యేష్ఠ పుత్రుడు ఎవరు?
A. అబ్షాలోము
B. అదోనీయా
C. సొలొమోను
D. అమ్నోను
Answer: D .అమ్నోను.
12 ➤ సౌలు తరువాత ఇశ్రాయేలు రాజు ఎవరు?
A. అబ్నేరు
B. ఇష్బోషెతు
C. మెఫీబోషెతు
D. యోవాబు
Answer: B .ఇష్బోషెతు.
13 ➤ వందమంది ఫిలిపీయుల ముందోళ్ళతో దావీదు ఎవరిని పెండ్లి చేసుకొన్నాడు?
A. మీకాలు
B. మయకా
C. హగ్గీతు
D. అహీనోయమ
Answer: A .మీకాలు.
14 ➤ దావీదుమీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఎవరి శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేసెను?
A. అశాహేలు
B. అబ్నేరు
C. యోవాబు
D. అబ్షాలోముు
Answer: B .అబ్నేరు.
15 ➤ 'పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను
బలహీనుడనైతిని' అని చెప్పిందెవరు?
A. ఇష్బోషెతు
B. అబ్షాలోము
C. దావీదు
D. సౌలు
Answer: C . దావీదు.
16 ➤ లాయీషు కుమారుడగు మీకాలు పెనిమిటి ఎవరు?
A. పల్తీయేలు
B. దావీదు
C. అబ్నేరు
D. అబ్షాలోము
Answer: A .పల్తీయేలు.
17 ➤ ఎవరు అభ్యాసము చేయుటకు దావీదు సౌలు యోనాతానుల
మీద ధనుర్గీతమొకటి చేసెను?
A. బెన్యామీయులు
B. సౌలు కుటింబీకులు
C. ఇశ్రాయేలు వారు
D. యూదావారు
Answer: D .యూదావారు.
18 ➤ యోనాతాను యొక్క కుంటి కుమారుడు ఎవరు?
A. రేకాబు
B. మెఫీబోషెతు
C. బయనా
D. ఎల్యాదా
Answer: B .మెఫీబోషెతు.
19 ➤ ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా అతనికి ఏమి కలుగజేయగా దావీదు వ్యాకులపడెను?
A.తెగులు
B. ప్రాణసంకటం
C. ప్రాణోపద్రవము
D. శరీరరుగ్మత
Answer: C .ప్రాణోపద్రవము.
20 ➤ ఎవరి ఇంటిలో దేవుని మందసము మూడు నెలలుండగా అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని యెహోవా ఆశీర్వదించెను?
A. ఓబేదు
B. మీకా
C. ఓబేదెదోము
D. ఒర్నాను
Answer: C . ఓబేదెదోము.
21 ➤ ఎవరు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయును గాక అని దావీదు అనెను?
A. అబ్నేరు
B. బెనాయా
C. అబ్షాలోము
D. యోవాబు
Answer: D .యోవాబు.
22 ➤ మీకాలు దావీదును ఏమి చేసినందున మరణము వరకు ఆమె పిల్లలను కనకయుండెను?
A. అపహాస్యము
B. వెక్కిరింత
C. ఎగతాళి
D. తిట్టుట
Answer: A .అపహాస్యము.
23 ➤ అమ్నోనును చంపించిన తర్వాత అబ్షాలోము పారిపోయి తన
తల్లి యొక్క తండ్రి గెష్టూరు రాజైన ఎవరి నొద్ద చేరెను?
A. రేయేరు
B. తల్మయి
C. లాకీషు
D. ఆకీషు
Answer: B .తల్మయి.
24 ➤ దావీదు జనులతో జరిగిన యుద్ధములో ఎవరు ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి?
A. ఇశ్రాయేలీయులు
B. మోయాబీయులు
C. ఫిలిష్తీయులు
D. అమ్మోనీయులు
Answer: A .ఇశ్రాయేలీయులు.
25 ➤ దావీదు సహోదరుని కుమారుడైన ఎవడు బహుకపటముగలవాడు?
A. యెహోయాకీము
B. యెహోనాదాబు
C. యెహోయారాముు
D.యెహోయాదా
Answer: B .యెహోనాదాబు.
26 ➤ మహాబలాఢ్యుడైన దావీదును ఎరిగిన వారు ఎటువంటి గుండె గలవారు సయితము దిగులొందుదురు?
A. రాతి గుండె
B. పక్షిరాజు గుండె
C. ఎలుగుబంటి గుండె
D. సింహపుగుండె
Answer: D .సింహపుగుండె.
27 ➤ దావీదు ఎక్కడ యూదా వారిని ఏలిన కాలము ఏడు సంవత్సరముల ఆరు మాసములు?
A. హెబ్రోనులో
B. షోమ్రోనులో
C. మహానయీములో
D. యెరూషలేము
Answer: A .హెబ్రోనులో.
28 ➤ బత్షెబ నిమిత్తము దావీదు ఎవరిని చంపించెను?
A. అబ్నేరు
B. అహీతోపెలు
C. ఊరియా
D. బెయాను
Answer: C .ఊరియా.
29 ➤ "ఊరియా"అనగా అర్ధము ఏమిటి?
A. యెహోవా నా రాజు
B. యెహోవా నా కాంతి
C. యెహోవా నా కాపరి
D. యెహోవా నా తోడు
Answer: B .యెహోవా నా కాంతి.
30 ➤ దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు ఏమి కల్పించుచున్నాడు?
A. సాధనములు
B. మార్గములు
C. వలలు
D. దారులు
Answer: A .సాధనములు.
31 ➤ ఏ ప్రవక్త ద్వారా యెహోవా దావీదు పాపమును ఆతనికి తెలియపరచగా అతడు పశ్చాత్తాపపడెను?
A. గాదు
B. అహీయా
C. నాతాను
D. హనన్యా
Answer: C .నాతాను.
32 ➤ దావీదుకు విరోధముగా కుట్ర చేసిన ఆతని కుమారుడు ఎవరు?
A. అబ్షాలోము
B. అమ్నోను
C. అదోనీయా
D. కిల్యాబు
Answer: A .అబ్షాలోము.
33 ➤ దావీదు మంత్రియైన ఎవరు కూడా అతని మీద కుట్ర చేసెను?
A.బెనాయా
B. అదోబెనీయా
C. అహీతోపెలు
D. హూషై
Answer: C . అహీతోపెలు.
34 ➤ దావీదు అబ్దాలోముకు భయపడి పాదరక్షలు లేకుండా
ఏ కొండ యేడ్చుచు ఎక్కెను?
A. హోరేబు కొండ
B. హెర్మోను కొండ
C. మీసారు కొండ
D. ఒలీవచెట్ల కొండ
Answer: D .ఒలీవచెట్ల కొండ.
35 ➤ దావీదుకు నిరంతరము దగ్గరగా యుండి యుద్ధములు చేసి న యోవాబు,అబీషై,ఆశాహేలు ఎవరి కుమారులు?
A. సాదోకు
B. సెరూయా
C. రిస్పా
D. అబీగయేలు
Answer: B .సెరూయాు.
36 ➤ ఏ పర్వతముల మీద మంచైనను వర్షమైనను లేకపొవునుగాక అని దావీదు అనెను?
A. హెర్మోను
B. గిల్బోవ
C. హోరేబు
D. ఒలీవల
Answer: B .గిల్బోవ.
37 ➤ అబ్షాలోము యొక్క తల్లి పేరేమిటి?
A. అబీగయేలు
B. అహీనోమయ
C. మయకా
D. హగ్గీతు
Answer: C .మయకా.
38 ➤ "అబ్షాలోము" అనగా అర్ధము ఏమిటి?
A. సమాధాన కర్త
B. శాంతి తండ్రి/సమాధాన తండ్రి
C. నీతికి రాజు
D. సమాధాన రాజు
Answer: B .పైవారందరు.
39 ➤ మహనయీములో నున్న దావీదుకు భోజన పదార్ధములు పంపిన బర్జిల్లయి ఏమై యుండి నీ దాసుడనని దావీదుతో అనెను?
A. అధిక ఆస్థిపరుడు
B. అధిక సంతానం కలవాడు
C. అధిక పేరుగలవాడు
D. అధిక ఐశ్వర్యవంతుడు
Answer: D .అధిక ఐశ్వర్యవంతుడు.
40 ➤ ఎవరి కుమారుడైన అహిమయస్సు మంచివాడని దావీదు అనెను?
A. కూష
B. అభ్యాతారు
C. హూషై
D. సాదోకు
Answer: D .సాదోకు.
41 ➤ "అహిమయస్సు" అనగా అర్ధము ఏమిటి?
A. వెలుగు
B. చల్లనిగాలి
C. కిరణము
D. మంచు
Answer: B .చల్లనిగాలి.
42 ➤ "యెహోనాదాబు"అను పేరుకు అర్ధము ఏమిటి?
A. యెహోవా నా దేవుడు
B. యెహోవా బహుమతి
C. యెహోవా నా అధిపతి
D. యెహోవా రక్షణ
Answer: B .యెహోవా బహుమతి.
43 ➤ అబ్షాలోము సైన్యాధిపతిగా ఎవరిని నియమించెను?
A. అమాశా
B. హూషై
C. అహీతోపెలు
D. యోనాతానును
Answer: A .అమాశా.
44 ➤ "అమాశా అనగా అర్ధము ఏమిటి?
A. విజయము
B. భారము
C. నష్టము
D. తేలిక
Answer: B .భారము.
45 ➤ రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు ఎవరు దావీదును శపించెను?
A. అహీతోపెలు
B. మెఫీబోషెతు
C. షిమీ
D. సీబా
Answer: C .షిమీ.
46 ➤ ఎవరు “నేను చచ్చినను బ్రదికినను, ఏ స్థలమందు నా
యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమం
దే నీ దాసుడనైన నేనుందునని” దావీదుతో మనవిచేసెను?
A. హూషై
B. సాదోకు
C. ఇత్తయి
D. అబ్యాతారు
Answer: C .ఇత్తయి.
47 ➤ అలసట నొంది ఎలా యున్న దావీదును చంపెదనని ఆహీతోపెలు అనెను?
A. నీరసంగా
B. రోగగ్రస్తుడుగా
C. వ్యాధిభరితుడుగా
D. బలహీనముగా
Answer: D .బలహీనముగా.
48 ➤ గిలాదీయుడైన బర్జిల్లయి ఎక్కడ నుండి యొర్దాను అద్దరి నున్న రాజు నొద్దకు వచ్చెను?
A. అదుల్లాము
B. మహానయీము
C. రోగెలీము
D. రబ్బా
Answer: C .రోగెలీము.
49 ➤ దావీదునకు తెలియకుండా యోవాబు అబ్నేరును పిలుచుటకు దూతలను పంపగా వారు దేని దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి?
A. హిమ్మోతు కొలను
B. గాజు తటాకం
C. గేరు చెరువు
D. సిరాయను బావి
Answer: D .సిరాయను బావి.
50 ➤ "రోగెలీము" అనగా అర్ధము ఏమిటి?
A. వికసించుట
B. విశ్రాంతి
C. అభివృద్ధి
D. నిమ్మళము
Answer: A .వికసించుట.
51 ➤ " సిరా" అను మాటకు అర్ధము ఏమిటి?
A. తీపి నీరు
B. మధుర జలము
C. చేదు నీరు
D. వ్యర్ధమైన
Answer: B .మధుర జలము.
52 ➤ బర్జిల్లయి ఎవరిని దావీదుతో పంపుటకు అతనిని అడిగెను?
A. హమ్మేదాతును
B. బాలును
C. షేరాయును
D. కింహాము
Answer: D .కింహాము.
53 ➤ “కింహాము” అను పేరునకు అర్ధము ఏమిటి?
A. ఆశ
B. జాలి
C. దయ
D. ప్రేమ
Answer: A .ఆశ.
54 ➤ బూసీయుడైన ఎవరి కళ్ళములో యెహోవా దావీదును బలిపీఠమును కట్టించమనెను?div>
A. హౌరౌనా
B. యెహోరానా
C. అరౌనా
D. సెరోనా
Answer: C .అరౌనా.
55 ➤ "అరౌనా" అనగా అర్ధము ఏమిటి?
A. పొడవైన
B. చురుకైన
C. వేగమైన
D. పొందికైన
Answer: B .చురుకైన.
56 ➤ జనసంఖ్య వ్రాయుటకు పంపబడినవారు దేశమంతయు
ఎంత కాలము తిరిగి వచ్చిరి?
A. తొమ్మిదినెలల ఇరువది దినములు
B. తొమ్మిదినెలల ఏడు రోజులు
C. పదినెలల ఇరువది దినములు
D. పదినెలల ఏడు దినములు
Answer: A .తొమ్మిదినెలల ఇరువది దినములు.
57 ➤ యెహోవా నామమున దావీదు కట్టించిన బలిపీఠము మీద అతడు దహన, సమాధాన బలులు అర్పించగా ఏమి ప్రజలను విడిచిపోయెను?
A. కరవు
B. ఖడ్గము
C. తెగులు
D. చిక్కులు
Answer: C .తెగులు.
58 ➤ సౌలు ఎవరి హతముచేసెను గనుక అతనిని బట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా దేశములో కరవు కలిగెను?
A. హివ్వీయులను
B. గిబియోనీయులను
C. హీత్తీయులను
D. యెబూసీయులను
Answer: B .గిబియోనీయులను.
59 ➤ గిబియోనీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా సౌలు యింటివారిలో
ఎంతమందిని యెహోవా సన్నిధిని ఉరితీసిరి?
A. ఏడుగురిని
B. నలుగురిని
C. ఇద్దరిని
D. పదిమందిని
Answer: A .ఏడుగురిని.
60 ➤ దావీదు ఎవరున్న ఇంటిలోనికి రాలేడనే సామెత పుట్టెను?
A. ఊచ చేతులు,కాళ్ళు వున్నవారు
B. కుష్టురోగులు
C. గ్రుడ్డివారును,కుంటివారును
D. జలోదర రోగస్థులు
Answer: A .ఊచ చేతులు,కాళ్ళు వున్నవారు.
61 ➤ దావీదు పాపములో పడుట రెండవసమూయేలు
గ్రంధములో ఏ అధ్యాయములో చూడగలము?
A. ఎనిమిదవ అధ్యాయము
B. పదకొండవ అధ్యాయము
C. పన్నెండవ అధ్యాయము
D. అయిదవ అధ్యాయము
Answer: B .పదకొండవ అధ్యాయము.
62 ➤ అబ్షలోముపై దావీదుకు జయము కలుగుటకు ముఖ్యకారకుడు ఎవరు?
A. అశాహేలు
B. యోవాబు
C. హూషై
D. అబీషై
Answer: B .యోవాబు.
63 ➤ యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తనశత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు చెప్పిన గీత వాక్యములు ఏ అద్యాయములో కలవు?
A. రెండవ అధ్యాయము
B. ఒకటవ అధ్యాయము
C. ఇరువదిరెండవ అధ్యాయము
D. పదకొండవ అధ్యాయము
Answer: C .ఇరువదిరెండవ అధ్యాయము.
64 ➤ ప్రభువైన క్రీస్తు గురించి దావీదు ప్రవచించిన దేవోక్తులు
ఏ అధ్యాయములో కలవు?
A. ఇరువదిమూడవ అధ్యాయము
B. మూడవ అధ్యాయము
C. పన్నెండవ అధ్యాయము
D. అయిదవ అధ్యాయము
Answer: A .ఇరువదిమూడవ అధ్యాయము.
65 ➤ రెండవ సమూయేలు గ్రంధము పరిశుద్ధ గ్రంధములో ఎన్నవది?
A. పదకొండవది
B. పదోవది
C. తొమ్మిదవది
D. ఎనిమిదవది
Answer: B .పదోవది.
66 ➤ రెండవ సమూయేలు గ్రంధము పరిశుద్ధ గ్రంధములో ఎన్నవది?
A. 11-18 అధ్యాయములు
B. 12-18 అధ్యాయములు
C. 12-17 అధ్యాయములు
D. 2-5 అధ్యాయములు
Answer: B .12-18 అధ్యాయములు.
67 ➤ దావీదు ఎవరెవరి గురించి గీత గానము చేసెను?
A. యెహోవా
B. సౌలు,యోనాతాను
C. ప్రభువైన క్రీస్తు
D. పైవారందరు
Answer: D .పైవారందరు.
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
Percentage: 0%
Tags:
.png)