ఓరన్న…
ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న…
లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా…
చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా
||ఓరన్న||
చరిత్రలోనికి
వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2)
||ఓరన్న||
పరమును
విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)
||ఓరన్న||
సిలువలో
ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)
||ఓరన్న||
.png)