Naa Thandri - నా తండ్రి

JC Worship Studio
0

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards




నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను


నీదు బిడ్డగా పెరిగి  -  నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం  - నన్నెంతో మురిపించింది (2)
నీ బంధం తెంచుకొని  - దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం  - శోకమునే చూపించింది         {{  లోకం }}

నీ కన్నులు నా కొరకు  -  ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించినా ప్రేమా  -  ఎక్కడ కనరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని  - తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే  -  నీ ప్రేమా ఎంతో చూపితివె      {{  నా తండ్రి  }}

Naa Thandri Nannu Manninchu
Neekanna Preminche Vaarevaru (2)
Lokam Naade Ani Ninnu Vidichaanu
Ghora Paapini Nenu Yogyathe Ledu
O Mosapoyi Thirigi Vachchaanu
Nee Premane Kori Thirigi Vachchaanu

Needu Biddagaa Perigi - Nee Premane Choodalekapoyaanu
Ne Choochina Ee Lokam - Nannentho Muripinchindi (2)
Nee Bandham Thenchukoni - Dooraanike Parigetthaanu
Ne Nammina Ee Lokam - Shokamune Choopinchindi       {{  Lokam }}

Nee Kannulu Naa Koraku - Enthaga Eduru Choochinavo
Ninnu Minchinaa Prema - Ekkada Kanaraaledu (2)
Ne Chanipoyi Brathikaanani - Thirigi Neeku Dorikaanani
Gundelaku Hatthukontive - Nee Premaa Entho Choopithive       {{  Naa Thandri  }}

Post a Comment

0Comments

Post a Comment (0)