Kalvari Giripai Siluva - కల్వరి గిరిపై సిలువ

JC Worship Studio
0


కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)

దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2)         (( కల్వరి ))

మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)       (( కల్వరి ))

ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను (2)       (( కల్వరి ))

Kalvari Giripai Siluva Bhaaram
Bharinchithivaa O Naa Prabhuvaa
Naa Paapamukai Nee Rakthamunu
Siluva Paina Arpinchithivaa (2)

Dushtundanai Ballemu Booni
Gruchchithi Thandri Prakkalona (2)
Keka Vesi Needhu Praanam
Siluva Paina Arpinchithivaa (2)        (( Kalvari ))

Moodu Dinamul Samaadhilo
Mudhamu Thoda Nidrinchithivaa (2)
Naa Rakshanaki Sajeevamutho
Samaadhin Gelchi Lechina Thandri (2)         (( Kalvari ))

Aarohanamai Vaagdhaanaathman
Sanghamu Paiki Pampinchithivaa (2)
Nee Raakadakai Nireekshanatho
Nindhalanella Bharinchedhanu (2)        (( Kalvari ))

Post a Comment

0Comments

Post a Comment (0)