దైవాత్మ రమ్ము - నా తనువున వ్రాలుము - నా =
జీవమంతయు నీతో నిండ - జేరి వసింపుము || దైవాత్మ ||
స్వంత బుద్ధితోను - యేసు ప్రభుని నెరుగలేను - నే =
నెంతగ నాలోచించిన విభుని - నెఱిగి చూడ లేను || దైవాత్మ ||
స్వంత శక్తితోను - యేసు - స్వామి జేరలేను - నే =
స్వంత శక్తితోను - యేసు - స్వామి జేరలేను - నే =
నెంత నడచిన ప్రభుని కలిసికొని - చెంత జేరలేను || దైవాత్మ ||
పాప స్థలము నుండి - నీ సువార్త కడకు నన్ను - భువి - నో =
పాప స్థలము నుండి - నీ సువార్త కడకు నన్ను - భువి - నో =
పరమాత్మ నడుపుచుండుము - ఉత్తమ స్థలమునకు || దైవాత్మ ||
పాపములో మరల - నన్ను పడకుండగ జేసి - ఆ =
పాపములో మరల - నన్ను పడకుండగ జేసి - ఆ =
నీ పరిశుద్ధమైన రెక్కల - నీడను కాపాడు || దైవాత్మ ||
పరిశుద్ధుని జేసి - నీ వరములు దయచేసి - నీ =
పరిశుద్ధుని జేసి - నీ వరములు దయచేసి - నీ =
పరిశుద్ధ సన్నిధిని జూపుమ - పావురమా వినుమా || దైవాత్మ ||
తెలివిని గలిగించు - నన్ను దివ్వెగ వెలిగించు - నీ =
తెలివిని గలిగించు - నన్ను దివ్వెగ వెలిగించు - నీ =
కలిగిన భాగ్యము లన్నిటిని నా - కంటికి జూపించు || దైవాత్మ ||
నన్నును భక్తులను - యే నాడును కృపతోను - నిల =
నన్నును భక్తులను - యే నాడును కృపతోను - నిల =
మన్నించుము మా పాప రాసులను - మాపివేయు దేవా || దైవాత్మ ||
వందనములు నీకు - శుభ - వందనములు నీకు - ఆ =
వందనములు నీకు - శుభ - వందనములు నీకు - ఆ =
నందముతో కూడిన నా హృదయ వందనములు నీకు || దైవాత్మ ||
.png)