Lyricist: Percy Theresa
పాట రచయిత: పెర్సి థెరీసా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ((ఎంత))
ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2) (( ఎంత ))
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా (2) (( ఎంత ))
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2) (( ఎంత ))
.png)