నా ప్రాణం నీ పాదములే కోరుచున్నది

JC Worship Studio
0


నా ప్రాణం నీ పాదములే కోరుచున్నది

తలవంచి నీ సన్నిధిలో వొదగాలన్నది

ప్రాణ ప్రియుడా నా యేసురాజా

ప్రాణములో ప్రాణమై వుండు రాజా


నిన్ను చూడాలని ఆశే నాలో నా ఆకలిని చంపుతున్నది

ఆశలు విడచి లోకాన్ని మరచి దీవారాత్రులు నీతోనే గడపాలన్నది

ప్రాణ ప్రియుడా నా యేసురాజా

ప్రాణములో ప్రాణమై వుండు రాజా ||నా ప్రాణం||


నీతో మాట్లాడాలని ఆశే నాలో కేకలు వేయుచున్నది

మౌనము విడచి నా నోరు తెరచి మనసారా నీతోనే మాట్లాడాలన్నది

ప్రాణ ప్రియుడా నా యేసురాజా

ప్రాణములో ప్రాణమై వుండు రాజా  ||నా ప్రాణం||


నీతో గడపాలనే ఆశే నాలో నా నిద్రను వదులుతున్నది

పడకను విడచి సుఖములు మరచి మోకాళ్లపై నీ కొరకే వేచివుండాలన్నది

ప్రాణ ప్రియుడా నా యేసురాజా

ప్రాణములో ప్రాణమై వుండు రాజా  ||నా ప్రాణం||






Post a Comment

0Comments

Post a Comment (0)