నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి
మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి ||నీతి||
చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును ||నీతి||
సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయన ||నీతి||
పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి ||నీతి||
పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు ||నీతి||
ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి ||నీతి||
ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే ||నీతి||
Neethigala Yehovaa Sthuthi Mee – Aathmatho Narpinchudi
Mee Aathmatho Narpinchudi – Daathayou Mana Kreesthu Neethini
Daalchukoni Sevinchudi ((Neethi))
Chadala Budamiyu Raviyu Jaladhiyu – Nadulu Girulunu Jakkagaa
Sadamalambagu Daiva Naamamu – Sarvadaa Nuthi Jeyunu ((Neethi))
Sarvashakthuni Kaaryamula Kee – Sarva Raashtramu Lanniyu
Garvamulu Vidi Thalalu Vanchuchu – Nurvilo Nuthijeyanu ((Neethi))
Geetha Thaandava Vaadyamulache – Breethi Parachedu Sevatho
Paathakambulu Pariharinchedu – Daathane Sevinchudi ((Neethi))
Parama Doothalu Narulu Pudamini – Moralubettuchu Devuni
Paramu Nandunnatti Yesuni – Paadamulu Sevinthuru ((Neethi))
Ilanu Bhakthulu Goodukoniyaa – Balamu Galgina Devuni
Velayu Sthuthi Ve Nollathodanu – Visugu Jendaka Jeyudi ((Neethi))
Aathma Neevika Melukoni Shu – dhdhaathma Yesuni Dandrini
Thrithvamagunaa Yeka Devuni – Harshamuna Sevimpave ((Neethi))
.png)