కళ్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం (2)
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) (( కళ్యాణం ))
ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే (2)
ఈ శుభ దినమున
నవ దంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయ్యా (( దేవా రావయ్యా ))
కానా విందులో ఆక్కరనెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే
అండగా నుండి (2)
కొరతలు తీర్చి నడుపుమయ్యా (( దేవా రావయ్యా ))
బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే (2)
ఇహ పర సుఖములు
మెండుగ నొసగి (2)
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా (( దేవా రావయ్యా ))
Kalyaanam Kamaneeyam
Ee Samayam Athi Madhuram (2)
Devaa Raavayyaa Nee Deevenaleevayyaa (2) (( Kalyaanam ))
Edenu Vanamuna Yehova Devaa
Modati Vivaahamu Chesithive (2)
Ee Shubha Dinamuna
Nava Dampathulanu (2)
Nee Deevenalatho Nimpumayyaa (( Devaa Raavayyaa ))
Kanaa Vindulo Akkaranerigi
Neellanu Rasamuga Maarchithive (2)
Kashtamulalo Neeve
Andaga Nundi (2)
Korathalu Theerchi Nadupumayyaa (( Devaa Raavayyaa ))
Budhdhiyu Gnaanamu Sampadalanniyu
Gupthamai Yunnavi Neeyande (2)
Iha Para Sukhamulu
Menduga Nosagi (2)
Ila Vardhillaga Cheyumayyaa (( Devaa Raavayyaa ))
.png)