నా యెడల నీకున్న తలంపులన్నియు
విస్తారమైనవి లెక్కకు మించినవి (2)
నీ కృపలను గూర్చి నే పాడెద
నీ ప్రేమ సువార్తను నే చాటిదా ( 2 )
నీ సాక్షిగా నేను జీవించెద ( 1 ) || నా యెడల ||
ఊహకు మించిన కార్యాలెన్నో చేస్తూ ఉన్నావు ,
శోధన శ్రమలలో నన్ను విడువక నడిపిస్తున్నావు ( 2 )
మాట తప్పని దేవుడవు నీవే
మహిమలు చేసే నాథుడ నీవే ( 2 )
జీవితమంతా నిన్నే స్తుతింతును ( 1 ) || నా యెడల ||
శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు
నీ సన్నిధిని నాకు తోడుగా పంపిస్తున్నావు ( 2 )
నన్ను మరువని దేవుడవు నీవే,
నడిపిస్తున్న నాథుడ నీవే ( 2 )
నిత్యము నిన్నే సేవించెదను ( 1 ) || నా యెడల ||
.png)