పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushotham Chaudhary
నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
ముందు నీ పాదారవిందము - లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా - డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||
హద్దులేనట్టి దురాశల - నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి - వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
కాలము పెక్కు గతించెను - గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు - చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
దారుణ సంసార వారధి - దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు - లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
నా వంటి దుష్కర్మ జీవిని - కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే - రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
Nannu Gannayya Raave Naa Yesu
Nannu Gannayya Raave Naa Prabhuvaa ||Nannu||
Mundu Nee Paadaaravindamu - Landu Nischala Bhakthi Premanu (2)
Pondikagaa Jeyaraave Naa - Dendamaananda Mananthamai Yupponga ||Nannu||
Haddu Lenatti Duraashala - Navivekinai Koodi Yaadithi (2)
Moddulatho Ninka Kootami - Vaddayya Vaddayya Vaddayya Thandri ||Nannu||
Kaalamu Pekku Gathinchenu - Garvaadu Ledadhegavaayenu (2)
Ee Loka Maaya Sukhechchalu - Chaalunu Jaalunu Jaalu-no Thandri ||Nannu||
Daaruna Samsaara Vaaradhi - Dari Joopi Prova Nee Kannanu (2)
Kaarana Guruvu Linkevvaru - Lerayya Lerayya Lerayya Thandri ||Nannu||
Naa Vanti Dushkarma Jeevini - Kevalamagu Needu Permini (2)
Deevinchi Rakshimpanippude - Raavayya Raavayya Raavayya Thandri ||Nannu||
.png)